VOTERS | భగీరత్ పల్లి లో వినూత్న ప్రచారం…

VOTERS | భగీరత్ పల్లి లో వినూత్న ప్రచారం…
VOTERS | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని భగీరత్ పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పల్లెర్ల సంతోష్ కుమార్ గుప్తా వినూత్న ప్రచారం చేపట్టారు. ఆయన గ్రామంలోని పలు హోటల్లోకి వెళ్లి అక్కడ చాయ్ తయారుచేసి పలువురికి చాయ్ తాగించారు. గ్రామ సర్పంచ్ గా తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.
ఆయన నిర్వహిస్తున్న వినూత్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుంది. పర్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ సర్పంచిగా తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
