ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక డంప్ చేసి మరోచోటుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను, ఒక జేసీబీ (Two lorries and a JCB) ని విజులెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రేగొండ ఎస్ఐ సందీప్ కుమార్ (Sandeep Kumar) తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రేగొండ మండల కేంద్రంలోని పరకాల – భూపాలపల్లి (Bhupalpalli) జాతీయ రహదారి చెక్ పోస్ట్ వద్ద ఇటుక బట్టి వెనకాల ఇసుక డంపులు చేసి అక్కడి నుండి ఇతర ప్రదేశాలకు తరలించేందుకు జెసిబితో మండలానికి చెందిన లారీల్లో లోడ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు (Vigilance officers) దాడులు నిర్వహించి రెండు లారీలు, ఒక జేసీబి నీ పట్టుకుని రేగొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇసుక డంపులు సీజ్ చేసి రెండు లారీలు, జేసీబీ ని స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.