వేదాంత పవర్ బిజినెస్ ఒప్పందం…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPDCL) నుంచి వేదాంత లిమిటెడ్ థర్మల్ వ్యాపార యూనిట్లు మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (MEL), వేదాంత లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్ (VLCTPP) 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (PPA) పొందాయి. ఇది తన స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తిదారు (IPP) వ్యాపారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుండగా, భారతదేశ ఇంధన భద్రతకు నమ్మకమైన సహకారిగా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
లెటర్స్ ఆఫ్ అవార్డు (LOAs) ప్రకారం, వేదాంత MEL, VLCTPP వరుసగా 300 MW, 200 MW విద్యుత్‌ను TNPDCLకి సరఫరా చేస్తాయి. ఫిబ్రవరి 1, 2026 నుంచి జనవరి 31, 2031 వరకు అమలులో ఉండే ఈ ఐదేళ్ల ఒప్పందాన్ని ~₹5.38/kWh టారిఫ్‌తో ప్రదానం చేశారు. వేదాంత పవర్ ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని మీనాక్షి ఎనర్జీ, ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత లిమిటెడ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నాయి. TNPDCL ద్వారా టెండర్ చేయబడిన మొత్తం 1,580 MWలలో అత్యధికంగా 500 MW కేటాయింపును పొందింది. ఇది విద్యుత్ రంగంలో దాని పోటీతత్వానికి, కార్యాచరణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ రెండు విద్యుత్ ప్లాంట్లను ఇటీవల వేదాంత రికార్డు సమయంలో కొనుగోలు చేసి, కార్యాచరణలోకి తీసుకువచ్చింది. దీని గురించి వేదాంత లిమిటెడ్ పవర్ – సీఈఓ రాజిందర్ సింగ్ అహుజా(CEO Rajinder Singh Ahuja) మాట్లాడుతూ, “భారతదేశ ఇంధన భద్రతకు విశ్వసనీయమైన బేస్‌లోడ్ శక్తి చాలా ముఖ్యమైనది కాగా, ఆ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో థర్మల్ శక్తి కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ విజయం సమర్థవంతమైన, విశ్వసనీయమైన నమ్మదగిన విద్యుత్ ఉత్పత్తిలో వేదాంత పెరుగుతున్న నాయకత్వాన్ని ప్రతిబింభిస్తుంది. మీనాక్షి ఎనర్జీ, VLCTPP మా విజయవంతమైన మలుపు, మా ఆపరేటింగ్ మోడల్ బలాన్ని ప్రదర్శిస్తూ, సంక్లిష్ట ఆస్తుల నుంచి విలువను సృష్టించే వేదాంత సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (PPA) ఆదాయ విజిబిలిటీని, ఆర్థిక బలాన్ని మెరుగుపరుస్తాయి. వేదాంత పవర్ గుర్తింపు కింద మా విద్యుత్ పోర్ట్‌ఫోలియో(portfolio) ప్రతిపాదిత విభజన వైపు మేము కదులుతున్నప్పుడు భవిష్యత్ వృద్ధికి పునాది వేస్తాయి” అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో 1,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ మీనాక్షి ఎనర్జీని 2023లో వేదాంత కొనుగోలు చేసింది. రెండేళ్లలోనే ప్లాంట్‌ను పూర్తి కార్యాచరణ సామర్థ్యానికి తీసుకువచ్చి, వేగవంతమైన పునరుద్ధరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేసింది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని సింగితారాయ్‌లోని 1,200 మెగావాట్ల వేదాంత లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్ (VLCTPP) (గతంలో అథీనా పవర్), 2022లో సగం పూర్తయిన ప్రాజెక్టుగా కొనుగోలు చేసింది.
ఆగస్టు 2025లో దాని మొదటి 600 మెగావాట్ల యూనిట్‌ను ప్రారంభించింది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వ్యాప్తంగా దాదాపు 5GW మర్చంట్ పవర్ (IPP ఆస్తులు)తో సహా, వేదాంత తన వ్యాపారాల అంతటా దాదాపు 12 GW థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని నిర్వహిస్తోంది. వేదాంత పవర్ వ్యాపారం కింద సమిష్టిగా ఉంచబడిన ఈ ఆస్తులు, భారతదేశం ఇంధన భద్రతను, ఆర్థిక స్థితిస్థాపకత వైపు ప్రయాణాన్ని బలపరుస్తాయి.
వేదాంత పవర్ గురించి:
వేదాంత గ్రూప్ భారతదేశం, విదేశాలలో కార్యకలాపాలు కలిగిన క్రిటికల్ ఖనిజాలు, ట్రాన్సిషన్ మెటల్స్, ఎనర్జీ, టెక్నాలజీ రంగాలలో గ్లోబల్ లీడర్‌గా నిలిచింది. వేదాంత పవర్ వ్యాపారం, 12,000 మెగావాట్ల థర్మల్ పవర్ సామర్థ్యంతో, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇది దేశంలోని శక్తి అవసరాలను తీర్చడంలో, విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తోంది.
వేదాంత పవర్‌కు పంజాబ్‌లోని మాన్సా (తల్వండి సాబో పవర్ లిమిటెడ్), ఛత్తీస్‌గఢ్‌లోని సింగ్‌ఠరాయ్ (వేదాంత లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్), ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి (మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్), జార్సుగుడా (జార్సుగుడా IPP ప్లాంట్) ప్రాంతాలలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.
ఈ కేంద్రాల కలిపి వ్యాపార విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4,780 మెగావాట్లు కాగా, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలు, యుటిలిటీలు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేస్తోంది.
మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (MEL) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని థమ్మినపట్నంలో ఉన్న 1,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్‌లో మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయి. (2×150 మెగావాట్లు మరియు 2×350 మెగావాట్లు).
వేదాంత లిమిటెడ్‌కు అనుబంధ సంస్థగా ఉన్న MEL, సురక్షితమైన, నమ్మదగిన, బాధ్యతాయుత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. ఇది కఠినమైన ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ప్రాక్టీసులు, ఇంధన భద్రత, బలమైన సమాజ భాగస్వామ్యాలతో నడుస్తోంది.
VLCTPP ఒక బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్, 1,200 మెగావాట్ల (2×600 మెగావాట్లు) ఇన్‌స్టాల్డ్ సామర్థ్యంతో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సక్తి జిల్లాలోని సింగ్‌ఠరాయ్ గ్రామంలో ఉంది.
మరిన్ని వివరాల కోసం చూడండి:
🔗 https://www.vedantalimited.com/eng/businesses-power.php
వేదాంత లిమిటెడ్….
వేదాంత గ్రూప్ భారతదేశం, దక్షిణాఫ్రికా, నమీబియా, లైబీరియా, యుఎఇ, సౌదీ అరేబియా, కొరియా, తైవాన్, జపాన్‌లలో కార్యకలాపాలతో ఉన్న క్రిటికల్ మినరల్స్, ట్రాన్సిషన్ మెటల్స్, ఎనర్జీ, టెక్నాలజీ రంగాలలో గ్లోబల్ లీడర్. ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర జింక్ ఉత్పత్తిదారు, నాలుగో అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు, ప్రపంచంలోనే ప్రముఖ అల్యూమినియం ఉత్పత్తిదారులలో ఒకటైన వేదాంత, ఎనర్జీ ట్రాన్సిషన్‌కు అవసరమైన ముఖ్య పదార్థాల గ్లోబల్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ సంస్థ భారతదేశంలోని ఏకైక ప్రైవేట్ ఆయిల్ & గ్యాస్ ఉత్పత్తిదారు, అతిపెద్ద ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్లలో ఒకటి. గ్లోబల్ ESG ఛాంపియన్‌గా, వేదాంత 2050 నాటికి లేదా అంతకంటే ముందుగానే నెట్ జీరో ఉద్గారాలు సాధించడానికి కట్టుబడి ఉంది.
తన రూపాంతరాత్మక సామాజిక ప్రభావ కార్యక్రమాల ద్వారా, సంస్థ దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో దాదాపు 70 లక్షల మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచింది.
మరిన్ని వివరాల కోసం సందర్శించండి:

