ఏడో వార్డు ఆధునీకరణ బాధ్యత నాది…

ఏడో వార్డు ఆధునీకరణ బాధ్యత నాది…

  • ప్రచారంలో పాల్గోన్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

వైరా, ఆంధ్రప్రభ : ఏడో వార్డులో అభివృద్ధిని చూసి అభివృద్ధి కారకుడైన పణితి సైదులకు ఓటేసి గెలిపించండి అంటూ వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పేర్కొన్నారు.. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర మార్క్ పేడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో వారు పాల్గొన్నారు..

వార్డులోని మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు పనితి సైదులు దంపతులకు హారతులు ఇచ్చి.. తిలకం దిద్దారు.. అంతేగాక వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.. డప్పు వాయిద్యాలతో కోలాటాలతో రోడ్ షో నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడో వార్డుకు పనితి సైదులు ఆధ్వర్యంలో 15 ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చామని.. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయని త్వరలో పూర్తయితాయన్నారు.. అయితే మరో 30 ఇల్లు కావాలని సైదులు అడుగుతున్నట్లు ఆయన తెలిపారు.. అవసరమైన 30 ఇల్లు కూడా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు…

వార్డులో మరింత అభివృద్ధి చెందాలంటే పనితీ సైదులును గెలిపించే బాధ్యత వార్డు ప్రజలు తీసుకోవాలని.. వార్డు ఆధునీకరణ సుందరీ కరణ తాను చూసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.. అంతేకాకుండా సీనియర్ నాయకులు పనితీ శ్రీను ఏడవ వార్డు లో పోటీ తాను పోటీ చేసేందుకు టికెట్ ఆశించాడని… మిత్రుడైన పనితి శీను ను రాబోయే కాలంలో గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు… అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పణితి సైదులు మాట్లాడుతూ.. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మంచి మనసున్న మనిషి అని వార్డుకు సంబంధించి ఎటువంటి పని అయినా తక్షణమే స్పందించి ఏ శాఖ అధికారితోనైనా ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసే గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అన్నారు..

గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో సీనియర్ నాయకులు బొర్రా రాజశేఖర్ వెంట నడుస్తున్నానని.. ప్రతినిత్యం నన్ను అభిమానిస్తూ వార్డు అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు ఇస్తూ.. నా ఎదుగుదల లో వార్డు అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు అన్నారు.. వార్డు ప్రజలు నన్ను ఆదరించి.. అభిమానించేందుకు ప్రధాన కారణం గత ఐదేళ్లు వార్డులో ఎన్నో సేవా కార్యక్రమాలు వార్డు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అభివృద్ధి చేయడమే కారణమన్నారు.. ఈ వార్డులో వర్షాలు కురిస్తే రోడ్లంతా బురదమయంగా మారిపోతుందని.. ఆ బురద రోడ్డులోనే నడిచామని.. ఆ నీళ్లలోనే వార్డు ప్రజలందరూ తిరిగారన్నారు.. అటువంటి వార్డును ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి వృధా కాకుండా దుర్వినియోగం కాకుండా.. సీసీ రోడ్లు డ్రైన్లు, వాటర్ లైన్లు నిర్మాణం చేపట్టి అభివృద్ధి బాటలో నడిపామన్నారు..

ఎన్నికల్లో టిడిపి మద్దతుతో తాను పోటీలో ఉన్నానని… అన్ని ప్రచారాల్లో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొంటూ.. నా వెంటే ఉండి ఓట్లు అభ్యర్థిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.. వార్డు పెద్దలందరూ సూచనలతో.. వార్డు అభివృద్ధి లక్ష్యంగా తొలినాటి నుండి పనిచేస్తున్నానని.. నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు.. ఎంతమంది ఏ కుయుక్తులు పన్నిన ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అభివృద్ధి కే వారు ఓటు వేసి గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి, బీడీకే రత్నం, ముల్లపాటి సీతారాములు, వార్డు పెద్దలు పోటు మధు, పైడిపల్లి శ్రీను చెరుకూరు శ్రీను సరిపుడి కోటేశ్వరరావు దారా వెంకన్న పనితి వెంకటేశ్వర్లు పనితి నాగార్జున బీరెల్లి గురవయ్య టిడిపి నాయకులు చెరుకూరు చలపతి మద్దినేని రామారావు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply