Vacancies | ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి..
- న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి..
- ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్..
Vacancies | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని.. వారిపై పనిభారం తగ్గించాలని ఏపీ ఎన్జీజీవో అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్(Vidyasagar) విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్టీవో హోమ్ లో జరిగింది. కార్యక్రమానికి ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ముఖ్య అతిథి(chief guest)గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్జీజీవో అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటూ చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు.

వారికి న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు, వేతన సవరణలపైనా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీవోస్(AP NGOs) పక్షాన పూర్తి తోడ్పాటు ఉంటుందని, సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తుదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలోనూ, ఉమ్మడి ఐక్య కార్యాచరణ ఉద్యమాలను(Operational movements) విజయవంతం చేయడంలో ఏపీ ఏసీవో ముందుంటోందన్నారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం కూడా ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుంటారని, ఉండాలని కోరుకుంటూ నూతన కార్యవర్గానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు.
ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.ఎస్.సాయిరాం, అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 25 సంవత్సరాల క్రితం చూస్తే ఎన్జీవోస్ తరువాత రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కేడర్(kedar) నాలుగో తరగతి ఉద్యోగులు.. ఏ ఆఫీసులో చూసినా 30 శాతం నుంచి 40 శాతం మంది నాలుగో తరగతి ఉద్యోగులు ఉండే పరిస్థితి..ఇప్పుడు ముగ్గురు ఇద్దరికి, ఇద్దరు ఒకరికి పడిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగవ తరగతి ఉద్యోగుల ఖాళీలు(Employee vacancies) ఎన్ని ఉన్నాయో వాటిని భర్తీచేయాలని.. పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.. అవసరమైతే కొంత సడలింపు ఇచ్చేలా ముఖ్యమంత్రి గని విజ్ఞప్తి చేయాలని పేర్కొన్నారు.

ఆల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గా వి.ఎస్.సాయిరాం(ఎన్ టి ఆర్ )అధ్యక్షుడుగా ఎన్.చంద్రశేఖర్ (విశాఖ)సహాధ్యకుడు గా వి.శ్రీనివాసరావు (విజయనగరం)ఉపాధ్యక్షులు గా సి హెచ్.వీర వెంకయ్య (ఏలూరు)జి.శ్రీనివాసరావు (అనకాపల్లి)జి.నాగేశ్వరరావు (నెల్లూరు)కె.బాబూరావు (మన్యం)కార్యనిర్వాహక కార్యదర్శి గా పి.బాలరాజు (కృష్ణా)ప్రచార కార్యదర్శి గా జి.గౌరి నాయుడు (పార్వతీపురం)సంయుక్త కార్యదర్సులు గా కె.శ్రీనివాసరావు (గుంటూరు)ఎం.బాలస్వామి (కర్నూలు) లు ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డీ ఎస్ ఎన్ రెడ్డి ప్రకటించారు సహాయ ఎన్నికల అధికారి గా డి.రమేష్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఎపీ ఎన్జీజీఓ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జానకి, ఎన్టీఆర్ జిల్లా సహధ్యక్షుడు వీవీ ప్రసాద్, కోశాధికారి బి.సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు జి.రామకృష్ణ, వివిధ జిల్లాల నాల్గోవతరగతి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

