అద్దాలు పగలగొట్టి…

అద్దాలు పగలగొట్టి…

కారులో సొమ్ము అపహరణ.

బోధన్, ఆంధ్రప్రభ : బ్యాంకులో పని చేసుకుని ముగించుకొని బయటకు వచ్చేలోపు కారులో అద్దాలు పగలగొట్టి అందులో నగదు చోరీ చేసిన సంఘటన బోధన్ పట్టణంలో శుక్రవారం జరిగింది. పట్టణానికి చెందిన హరిబాబు అనే వ్యక్తి కారులో మూడు లక్షల నగదు ఉంచి యూనియన్ బ్యాంకులో పని నిమిత్తం లోనికి వెళ్లాడు. బ్యాంకులో 10 నిమిషాలలో పని ముగించుకుని బయటకు వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకున్నారు.

కవర్ లో నగదు ఉంచి కారులో తాళం వేసి లోనికి వెళ్లి వచ్చేలోపు ఈ ఘటన జరిగినట్లు హరిబాబు పోలీసులకు వివరించారు. పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply