KNL | ఓర్వకల్ లో రెండు షాపులు దగ్ధం..

ఓర్వకల్, జూన్ 4 (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం గ్రామంలో ఓ బేకరీ షాపు అలాగే హార్డ్ వేర్ షాపు బుధవారం తెల్లవారుజామున కాలి బూడిదయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పోలీస్ పెట్రోలింగ్ బృందం బేకరీ నుంచి మంటలు రావడాన్ని గ్రహించారు. వెంటనే దుకాణం యజమాని వెంకటేశ్వర్లుకు సమాచారం ఇవ్వగా ఆయన అక్కడికి వచ్చారు. ఆ తర్వాత దుకాణం తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే లోపల మంటలు అధిక స్థాయిలో ఉండడంతో లోపలికి వెళ్లలేక బయటికి వచ్చేశారు.

ఇక మంటల ధాటికి బేకరీలో ఉన్న సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా పైకప్పు పూర్తిగా లేచిపోయింది. ఇక లోపల ఉన్న సామాన్లు కాలి బూడిదయ్యాయి. ఫ్రిడ్జ్ తో పాటు బేకరీ ఐటమ్స్, సిగరెట్ ప్యాకెట్లు, డబ్బులు మొత్తం కాలి బూడిదయ్యాయి. పక్కనే ఉన్న హార్డ్ వేర్ షాప్ లో కూడా మొత్తం కాళీ బూడిదైంది. వెంటనే ఫైర్ ఇంజన్ వారికీ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని షాపులకు అంటుకున్న మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా ఆర్పి వేశారు. రూ.15ల‌క్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చని యజమానులు తెలిపారు. జీవనోపాధి కోల్పోతున్నామని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

Leave a Reply