Tributes | ఎమ్మెల్యే పరామర్శ..

Tributes | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు కొక్కిలిగంట పరమేశ్వరరావు తండ్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పార్ధివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
