ట్రాఫిక్ నియమాలే ప్రాణ రక్షణకు కవచం

ట్రాఫిక్ నియమాలే ప్రాణ రక్షణకు కవచం

హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం తప్పనిసరి
అధిక వేగం, మద్యం డ్రైవింగ్ ప్రాణాంతకం
చాగల్లు రైతు వేదికలో రోడ్డు భద్రత అవగాహన సమావేశం
కౌన్సిలర్ల విజ్ఞప్తికి స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు
ముఖ్య అతిధిగా హాజరైన ట్రేని ఐపీఎస్ మనీషా నెహ్ర

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వాహనదారులు ట్రాఫిక్ నియమా లను తప్పనిసరిగా పాటించాలని ట్రేని ఐపీఎస్ మనీషా నెహ్ర పేర్కొ న్నారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.


వాహనాలను అధిక వేగంతో నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయ డం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా క్రాస్ రోడ్ల వద్ద వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ట్రాఫి క్ నియమాలు వాహనదారులతో పాటు పాదచారులకు కూడా పూర్తిగా తెలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించగలమని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గిం చుకోవచ్చని చెప్పారు. ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాల వల్లనే జరుగుతాయి. అందరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చని వివరించారు.ఈ కార్యక్రమం లో సీఐ వేణు, ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొ న్నారు.

కౌన్సిలర్ల విజ్ఞప్తికి స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు

చాగల్లు గ్రామం వద్ద ఉన్న యూటర్న్ ప్రాంతంలో చెట్లు ఉండటం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్న సమస్యను ట్రేని ఐపీఎస్ మనీషా నెహ్ర, సీఐ వేణు దృష్టికి 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్, 6వ వార్డు కౌన్సిలర్ బాలగాని అనిల్ గౌడ్ తీసుకువచ్చారు. ఈ సమస్యపై వారు ఆలస్యం చేయకుండా వెంట నే స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారి అధికారులతో వెంటనే సమస్యపై మాట్లాడి రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీస్ అధికా రులకు కౌన్సిలర్ లు రాజేష్, అనిల్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

.

Leave a Reply