తిరుపతిలో ఫేక్ మెయిల్ అలజడి

తిరుపతిలో ఫేక్ మెయిల్ అలజడి
- ప్రైవేటు స్కూలుకు బెదిరింపులు
- రంగంలోకి అలిపిరి పోలీసులు
- బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీ
- ఏమీ లేవని తేల్చిన పోలీసులు
తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : తిరుపతి(Tirupati) నగరంలోని యశోద నగర్ లోని ప్రైవేట్ స్కూల్(Private School)కు మంగళవారం బాంబు(Bomb Threat) బెదిరింపు కలవరం రేపింది. ఈ బెదిరింపు మెయిల్ రావడంతో స్కూల్ యాజమాన్యం సమాచారాన్నిఅలిపిరి సీఐ రామ్ కిషోర్ హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి తనిఖీ(Investigation0 చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ, రామ్ కిషోర్ మాట్లాడుతూ తరగతి గదిలో ఆర్.డీ.ఎక్స్.ఐ.ఈ.డి.(RDXIED) పేలుడు పదార్థాలు పెట్టినట్లు హెచ్చరించారని వివరించారు.
పీ.ఎస్.వై.వార్ ప్రస్తావనతోపాటు తమిళనాడుకు చెందిన కొంతమంది పేర్లు ఉన్నాయన్నారు. తనిఖీలు చేపట్టగా అక్కడ ఏమి లభించలేదన్నారు. గతంలో వివిధ స్టార్ హోటల్స్ కి మెయిల్స్ వచ్చాయని, అదే రీతిలో ప్రస్తుతం స్కూలుకి ఈ విధంగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి క్షుణ్ణంగా మెయిల్‌ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు అలిపిరి పోలీస్(Police ) స్టేషన్ పరిధిలో తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీల్లో అలిపిరిఎస్ఐ అజిత, డాగ్ స్క్వాడ్(Dog Squad), బాంబు స్క్వాడ్(Bomb Squad), సిబ్బంది పాల్గొన్నారు.

