తిరుపతి – . తిరుమలకు భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్‌ను మరిన్ని కమర్షియల్ అంశాలతో అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ సిద్దమైంది. బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్‌కు స్కే వే సిద్దం కానుంది. దాదాపు రూ. 500 కోట్లతో జీ-ప్లస్ 10 అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
కొత్త హంగులతో తిరుపతి బస్ స్టేషన్ త్వరతోనే ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌గా మారబోతోంది. ఈ మేరకు కేంద్రం డిజైన్స్, డీపీఆర్ సిద్దం చేసింది. 13 ఎకరాల్లో ఉన్న తిరుపతి బస్టేషన్ లో ప్రస్తుతం 66 ప్లాట్ ఫాంలు ఉన్నాయి.నిత్యం దాదాపు 1.60 లక్షల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటూరు.
దేశ వ్యాప్తంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం పూర్తి హంగులతో తీర్చి దిద్దాలని నిర్ణయించారు.