Thug Life ట్రైలర్ రిలీజ్ !

విశ్వనటుడు కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. శింబు కూడా ఈ సినిమాలో ఒక పాత్ర పోషిస్తున్నందున, ఈ మల్టీస్టారర్ చిత్రంపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే మణిరత్నం ఈ చిత్రాన్ని తనదైన క్లాసీ టచ్ తో పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని తెలుస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ చాలా విభిన్నమైన గెటప్ లలో కనిపిస్తున్నాడు. గాడ్ ఫాదర్ లాంటి పాత్రలో కమల్ తన ప్రత్యేకమైన నటనా నైపుణ్యాలను చూపించబోతున్నాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే, శింబు కూడా సాలిడ్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఏఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 5న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Leave a Reply