దోపిడీ దొంగల హల్ చల్

దోపిడీ దొంగల హల్ చల్

10 తులాల బంగారం , రూ :1, 30,000 నగదు అపహరణ

దమ్మపేట, ఆంధ్రప్రభః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం ,దమ్మపేట మండలం రామచంద్రాపురంలో శనివారం రాత్రి దోపిడీ దొంగలు హల్ చల్ చేసి పది తులాల బంగారం , రూ : 1, 30,000 నగదు అపహరించుకుపోయారు.ఈ సంఘటనకు సంబంధించి దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట మండలపరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో శనివారం రాత్రి కంభంపాటి గురునాధం అనే వ్యక్తి ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు , చేతులకు గ్లౌజ్ లు ధరించి కంభంపాటి గురునాధం ఇంట్లోకి ప్రవేశించి భార్యా భర్తలు ఇద్దరినీ గురునాధం ,ఉదయలక్ష్మీ దంపతులను తాళ్లతో కట్టివేసి చంపుతామని బెదిరించి బీరువా తాళాలను తీసుకుని ,బీరువాలోని పది తులాల బంగారం , రూ :1, 30,000/- నగదును అపహరించుకుపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు పాల్వంచడీఎస్పీ సతీష్ కుమార్ , అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి , దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి , సిబ్బంది సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్ , డాగ్ స్క్వాడ్ తో వెళ్లి పరిశీలించారు .దోపిడీ దొంగలు ఇంటి వెనుక వైపు నుండి లోనికి ప్రవేశించి ఉంటారని , ఇది తెలిసిన వాళ్ళ పని అయ్యుంటుందని లేకపోతే వెనుక భాగంలో మామిడి , పామాయిల్ తోట ,పెన్సింగ్ దాటి లోనికి ఎలా వస్తారనే కోణంలోవిచారణ చేస్తున్నట్లు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు .గురునాధం భార్య ఉదయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .

Leave a Reply