బహుళ ప్రయోజన కార్మికుల సేవలు అభినందనీయం

బహుళ ప్రయోజన కార్మికుల సేవలు అభినందనీయం

  • మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి
  • ప్రతి కార్మికుడు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి
  • మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్

రాయపర్తి, ఆంధ్రప్రభ : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో బహుళ ప్రయోజన కార్మికుల పాత్ర వేలకట్టలేనిదని వారి సేవలు ఎంతో అభినందనీయమని మండల ప్రత్యేక అధికారి వై శ్రీకాంత్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ అన్నారు. ఆదివారం మైలారం గ్రామంలో సర్పంచ్ చిర్ర వేణు అధ్యక్షతన పంచాయితీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ప్రత్యేక అధికారి వై. సతీష్ రెడ్డి,మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ పాల్గొని పంచాయతీ కార్మికులకు పిపిఈ కిట్లు ఇచ్చి, శాలువాలతో సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామం పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఎండనక, వాననక వారు పడుతున్న శ్రమను గుర్తించి గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రాణాలకు తెగించి గ్రామాల అభివృద్ధి కోసం, పారిశుద్ధ్యం కోసం శ్రమిస్తున్న కార్మికుల రక్షణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అందులో భాగంగానే వారికి రక్షణ కవచాలుగా నిలిచే పిపిఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి పెంచల విజేందర్,గ్రామ ఉపసర్పంచ్ లేతాకుల రత్నాకర్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply