భక్తుల భద్రతే లక్ష్యం..

  • రంగంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్
  • తిరుమలో 1000 మంది..
  • తిరుపతిలో 200 పోలీసులు పహారా
  • తిరుమలలో 4000 వాహనాలకు అనుమతి
  • మీడియాతో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు

తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : తిరుమలలో ప్రధాన ఘట్టం గరుడ సేవకు కట్టుదిట్ట ఏర్పాట్లు చేశామని, గరుడ సేవకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిలకించేలా చర్యలు చేపట్టామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. రాంభగీచ కమాండ్ కంట్రోల్ సెంటరులో గరుడసేవ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల సురక్షితంగా తిరుపతి నుంచి తిరుమల ..తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేలా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో 4 వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం కల్పించామని, రేపు (శనివారం ) సాయంత్రం 6 గంటలకు ద్విచక్ర వాహనాలకు అనుమతి నిషేధించామన్నారు.

తిరుపతిలో ఐదు ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం ఉందని, తిరుపతి పార్కింగ్ స్థలాల నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు భక్తులు చేరే అవకాశం కల్పించామన్నారు. మళ్ళీ తిరుమల భక్తులు పార్కింగ్ స్థలాలకు వెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు.

సీసీ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. ఏ. ఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు భద్రత కల్పించామన్నారు. గరుడ సేవకు నాలుగు మాడ వీధుల్లో నాలుగు హోల్డింగ్ పాయింట్లను టీటీడీ ఏర్పాటు చేసిందన్నారు.

నాలుగు హోల్డింగ్ పాయింట్ల ద్వారా వచ్చే భక్తులకు గరుడ సేవను వీక్షించేలా సౌకర్యాలు కల్పిస్తాం అని ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. ఫేక్ వెబ్ సైట్లు, తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గరుడ సేవకు వచ్చే భక్తులు పోలీసు, విజిలెన్స్ నియమ నిబంధనలకు సహకరించాలని ఎస్పీ సూచించారు. గరుడ సేవకు 1000 మంది అదనంగా పోలీసు సిబ్బందిని, తిరుపతికి 200 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించామన్నారు.

Leave a Reply