The fair l వైభవంగా ఏటి గంగమ్మ జాతర..

The fair l వైభవంగా ఏటి గంగమ్మ జాతర..

పెన్నానదిలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం

The fair l ఉరవకొండ రూరల్, ఆంధ్ర ప్రభ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పెన్నాహోబిలం వద్ద ఉన్న పెన్నా నది తీరాన వెలసిన ఏటి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. మాఘమాసం మూడవ ఆదివారం సందర్భంగా తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూజ కార్యక్రమాలనునిర్వహించారు. ఏటి గంగమ్మ జాతర పురస్కరించుకొని తెల్లవారుజామున నుండి పెన్నా నదిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నాలను ఆచరించి, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కుబడులను తీర్చుకున్నారు. అమ్మవారికి భాజా భజంత్రీలు నడుమ అశ్వత్థ నారాయణ కట్ట వరకు ఊరేగించారు. అమ్మవారిని దర్శించు కోనేందుకు కర్ణాటక, ఆంధ్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో, ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

Leave a Reply