పంట ఇంటికి రాదు..
మంత్రాలయం, ఆంధ్ర ప్రభ : మండలం పరిధిలోని బూదూరు(Boodoor) గ్రామంలో రైతుల ఇక్కట్లు విపరీత స్థాయికి చేరింది. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామానికి పడమటివైపు ఉన్న పొలాలకు వెళ్లే గ్రామంలో బెలగల్ రాస్త(Belagal Road) వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాస్త మొత్తం కోతకు గురైంది. కొన్నిచోట్ల వాగు ఉధృతికి భారీ గుంతలు పడ్డాయి. దీంతో రైతుల(Farmers) ఎడ్లబండ్లే కాదు ట్రాక్టర్లూ(Tractors) అవతలికి వెళ్లడం లేదు.
గ్రామ రైతులు వాగు దాటి వెళ్లలేక, పొలాల్లో ఉన్న పత్తి, సజ్జలు, జొన్నలు(cotton, sajjas, jowar), కొర్రలు ఇతర ధాన్యం ఇంటికి తీసుకురాలేని పరిస్థితి రైతులకు ఏర్పడింది. అయితే గ్రామానికి చెందిన మొత్తం వ్యవసాయ భూమిలో 70% శాతం(70% percent) భూమి పడమటి వైపే ఉండడంతో వందలాదిమంది రైతులు ఈ బెలగల్ రాస్త వాగు సమస్య వల్ల దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్య కేవలం వాగుపై బ్రిడ్జి(Bridge) నిర్మిస్తేనే తీరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు(Officials), పాలకులు తదితర నాయకులు ఈ సమస్యను పట్టించుకోవాలని బూదురు గ్రామ రైతులు వాపోతున్నారు.