రైతులపై కక్షగట్టిన కూటమి ప్రభుత్వం

హిందూపురం, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ) : సత్యసాయి జిల్లా (Satya Sai district) హిందూపురం రూరల్ మండలం చలివెందుల, రాచపల్లి, మినకుంటపల్లి, బాలంపల్లి, చెర్లోపల్లి, జంగాలపల్లి, మలుగూరు, బీరెపల్లి గ్రామాల్లో రైతుల వద్ద నుండి బలవంతపు భూ సేకరణ ఆపాలని గురువారం హిందూపురం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దీపికమ్మ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయం (Tahsildar Office) వద్ద వినతిపత్రం అందజేశారు. రైతులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి రెడ్డి, పార్టీ రాష్ట్ర అనుబంధం విభాగ నాయకులు, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతులు, రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply