ADB – కాపరిపై బీట్ ఆఫీసర్ దాడి: కవ్వాల అభయారణ్యంలో టెన్షన్ …
జన్నారం , ఆంధ్రప్రభ):మంచిర్యాల జిల్లా జన్నారంమండలంలోని కవ్వాల అభయారణ్యం ఇందనపల్లి రేంజ్ పరిదిలోని బర్తన్ పేట ఫారెస్ట్ బీట్ లో ఇందనపల్లికి చెందిన పశువుల కాపరి అలుగొట్టు గోపాలరాజన్నను ఫారేస్ట్ బీట్ అధికారిణి రుబీన మంగళవారం సాయంత్రం కొట్టారని ఆ గ్రామ ప్రజలు గ్రామ సమీపాన ఉన్న ప్రధాన రహాదారిపై బుధవారం మధ్యాహ్నం ధర్నా,రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రోడ్డుపై గేదెలను,ఆవులనును నిలిపి దాదాపు 2గంటల పాటు రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ రాజవర్దన్ జోక్యం చేసుకుని స్థానిక రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తో మాట్లాడి రాస్తారోకోను విరమింపచేశారు.
ఈ సందర్భంగా స్థానిక రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ,పశువుల కోసం నాలుగు కంపార్ట్ మెంట్లను కేటాయించామన్నారు.అందులోకి పశువులు వెళ్లకుండా వేరే కాంపార్ట్ మెంట్లలోకి పశువులు వెళ్తున్నాయన్నారు.ఈ విషయమై పశువుల కోసం అధనంగా కంపార్ట్ మెంట్ కేటాయించేలాగా పై అధికార్లకు నివేదిక పంపనున్నామన్నారు.ఈ విషయమై బిట్ ఆఫీసర్ రూబీనను ప్రశ్నించగా తాను ఎవరిని కొట్టలేదన్నారు.