పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

సామాన్య ప్రజలపై భారం పడొద్దని గొప్ప సంకల్పంతో…
కేంద్రం సాహసోపేత నిర్ణయం
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ము కొ ని, అంతర్జాతీ యం గా ముడి చమురు ధర లు ఆకాశాన్నంటు తు న్నా, సామాన్య ప్రజలపై ఆ భారం పడకూడదనే గొప్ప సంకల్పంతో పెట్రో ల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా రూ. 10 చొప్పున తగ్గి స్తూ కేంద్రం సాహసో పేత నిర్ణయం తీసుకుందనీ బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి సోమవారం ఒక ప్రక టనలో వెల్లడించారు. శ్రీరామ నవమి పర్వ దినం వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరువ లేని తీపి కబురు అం దించారన్నారు. ఈ సం దర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడారు. తాజా ఉత్తర్వుల ప్రకా రం పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ.13 నుండి రూ.3కి తగ్గగా, డీజిల్ పై సుంకాన్ని పూర్తిగా సున్నాకు పరిమితం చేయడం మోదీ జనరం జక పాలనకు నిదర్శన మని అన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాల హ యాంలో విచ్చలవిడిగా చేసిన అప్పులు, చెల్లిం చని ఆయిల్ బాండ్ల వేల కోట్ల భారం నేటికీ దేశంపై ఉన్నప్పటికీ, ఆ ఆర్ధిక ఇబ్బందుల న్నిం టినీ అధిగమించి ప్రజల సంక్షేమానికే ప్రధాని ప్రాధాన్యత ఇచ్చార న్నారు.శ్రీరామ నవమి కానుకగా కేంద్రం ఇచ్చి న ఈ భారీ వెసులుబా టు తో రవాణా ఖర్చు లు తగ్గి, నిత్యావసరాల ధరలు అదుపులోకి వచ్చి మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఊరట లభించనుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వంతుగా రూ.10 త గ్గించి బాధ్యత చాటు కున్న వేళ, ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోం దని రాష్ట్ర ప్రజలు ప్రశ్ని స్తున్నారన్నారు.కేంద్రం పదే పదే పన్నులు తగ్గి స్తున్నా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం ఒక్క రూపాయి కూ డా తగ్గించకుండా ప్రజ ల రక్తాన్ని పిండుతోం దనీ విమర్శించారు. పెట్రోల్ ధరలో రాష్ట్ర ప్రభుత్వ వాటానే కేంద్రం కంటే ఎక్కువగా ఉండటం సిగ్గుచేట న్నారు.కేవలం మాట లకే పరిమితం కాకుం డా, కాంగ్రెస్ ప్రభుత్వా నికి నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే, తక్షణమే వ్యాట్ తగ్గించి పెట్రోల్ ధరను రూ.100 లో పుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు

Leave a Reply