ఆదిలాబాద్, ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఐటీడీఏ ద్వారా గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే గిరిజన పోషన్ మిత్ర గిరిజన క్యాంటీన్ నిర్వహణతో ఆమె చేస్తున్న సేవలకు ఢిల్లీ స్కోచ్ గ్రూప్ కంపెనీ సీఎండీ చైర్మన్లు అవార్డు ఇచ్చిన విషయము విధితమే.
ఢిల్లీలో శనివారం జరిగిన స్కోచ్ సబ్మిట్ సమ్మేళనంలో పిఓ కు ఆహ్వానించి.. రాత్రి జరిగిన సమ్మేళన కార్యక్రమంలో స్కోచ్ గ్రూప్ కంపెనీ చైర్మన్ వైస్ చైర్మన్ డాక్టర్ గురు శరన్ దంజాల్, లు గోల్డెన్ స్పోర్ట్స్ అవార్డును అందజేశారని అదిలాబాద్ డి పి ఆర్ ఓ బాదావత్ తిరుమల తెలిపారు.
పివో కుష్బూ గుప్తా చేసిన సేవలను కొనియాడుతూ హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమేత మనోహర్ ఆ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారని తెలిపారు. పిఓపి అవార్డు రావడం పట్ల ఐటీడీఏ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.