కత్తి కాంగ్రెస్ చేతికిచ్చి బిఆర్ఎస్ ని యుద్ధం చేయమంటే ఎలా?

కత్తి కాంగ్రెస్ చేతికిచ్చి బిఆర్ఎస్ ని యుద్ధం చేయమంటే ఎలా?

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

నస్పూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికులు , ఓటర్లు కత్తి కాంగ్రెస్ చేతికిచ్చి సమస్యల పైన భారత రాష్ట్ర సమితిని పోరాడమంటే ఎలా అని బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మంచిర్యాల కేంద్రంలోని నస్పూర్ లో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపిన కేసీఆర్ సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో 16 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీసం మెడికల్ బోర్డు కూడా నిర్వహించడం లేదని అన్నారు.

సింగరేణి మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సృజన్ రెడ్డి కి కాంట్రాక్టులు ఇప్పించి దోచుకుంటున్నాడని ఆరోపించారు. సింగరేణి కార్మికుల మనుగడ కోసం ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేస్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్,కోవ లక్ష్మి, నడిపెల్లి దివాకర్ రావు, అనిల్ యాదవ్, టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి, కే. సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply