దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..

దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..

ఆశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : అన్ని దానాల కంటే అన్నదానం మహా గొప్పదని సుజాత విద్యా నికేతన్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ అన్నారు బుధవారం రోజున హన్మకొండ జిల్లా హసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల యజమాన్యం ప్రతి ఏటా వెజిటేబుల్ ఫెస్ట్ ను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు సేకరించిన ఒక వెయ్యి 500 కిలోల వివిధ రకాల కూరగాయలు బియ్యము, నిత్యవసర వస్తువులను అతిధి మానసిక వికలాంగుల ఆశ్రమము,లార్డ్స్ అనాధ శరణాలయం, సహృదయ మానసిక వికలాంగుల ఆశ్రమాలకు చెందిన వారిని పాఠశాలకు రప్పించి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రత్యక్ష అవగాహన కల్పించడం, సేవా దృక్పథాన్ని విద్యార్థి దశ నుండే అలవర్చుకుని భవిష్యత్తులో సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు.

ఆశ్రమ నిర్వాహకురాలు సుజాత మాట్లాడుతూ గత 15 ఏళ్ళుగా సుజాత విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ఆశ్రమానికి నిత్యవసర వస్తువులు వితరణ చేయడం అభినందనీయమని అన్నారు.ఈకార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు జూపాక నాగరాజు వెంకట్, ప్రవీణ్,వెంకటేశ్వర్లు, రాధాకుమారి, సబిహ, అరుణ, సిహెచ్ సంధ్య, సిహెచ్ సుచిత్ర, గీత, జి సంధ్య,ఎల్ సరిత, సుధారాణి, మౌనిక, ప్రవళిక, లావణ్య, దేవిక, దివ్య,స్వాతిలు పాల్గొన్నారు.

Leave a Reply