అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య పౌష్టికాహారం

అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య పౌష్టికాహారం
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణంలోని 3 వార్డు చైతన్య కాలనీ అంగన్వాడీ కేంద్రం – 12 లో బుధవారం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3, 4వార్డ్ కౌన్సిలర్స్ సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్, దొంతిరెడ్డి పద్మారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 5 సంవత్సరాల లోపు పిల్లలకు, కిశోరబాలికలు, గర్భిణీలు బాలింతలకు ఫౌష్టికాహారం, చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తున్నారని అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పౌష్టికాహారం బాలమృతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ దేవరం సావిత్రి, హెల్త్ అండ్ ఆషా వర్కర్లు రామకృష్ణ సబిత వినోద సీత మల్లీశ్వరి విద్యార్ధులు పాల్గొన్నారు.
