సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు

సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మట్టల ఆదివారం (పామ్ సండే) పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఈత మట్టలతో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ‘హోసన్నా’ నామస్మరణ చేశారు. అనంతరం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రెస్బిటర్ ఇన్-ఛార్జ్ సిహెచ్. అశోక్ మాట్లాడుతూ.. యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించిన రోజును స్మరించుకుంటూ మట్టల ఆదివారం వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. ఆయన చూపిన ప్రేమ, శాంతి, క్షమ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు డి. జోనా శుభాకర్, డి. శ్రీనివాస్, ఎన్. జాన్ రూబెన్, జె.ఇ. రవికుమార్, జి. బెన్నీ కమలాకర్, కె. సోఫియా ఆలివర్, కె. ప్రశాంత్, కె. డానియల్ కమలాకర్, సిహెచ్. లెనోరా అశోక్, జె. అనిల్ వినయ్ కుమార్, కె. అమర్, కె.జి. ప్రకాష్, డి. ఇమ్మాన్యుయేల్, టి. డానియల్, జి. జోసెఫ్ రాజ్, కె. రమేష్, కొప్పుల దేవదాసు, సంజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply