జుక్కల్ మండల కేంద్రంలో కుస్తీ పోటీలు..

జుక్కల్ మండల కేంద్రంలో కుస్తీ పోటీలు..
జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలోని గ్రామ శివర్లో ప్రసిద్ధిగాంచిన మహాదేవుని గుడి బర్షి పండుగ సందర్భంగా సోమవారం సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కుస్తీ పోటీల నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజాము నుండి మహా దేవుని గుడిలో ప్రత్యేక పూజలు,అభిషేకంతో పాటు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం కుస్తీ పోటీలు ఉంటాయని మల్లయోధులు, జుక్కల్ తో పాటు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు అత్యధికంగా పాల్గొని కుస్తీపోటీలను విజయవంతం చేయాలన్నారు.
