మార్కెట్ రేటుకు మూడు రేట్లు పరిహారం ఇవ్వాలి..

మార్కెట్ రేటుకు మూడు రేట్లు పరిహారం ఇవ్వాలి..

భూములు కోల్పోతున్న రైతులు
ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ మార్కెట్ రేటు కు మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో ఆయన మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డును ఓ ఆర్ ఆర్ రోడ్డుకు సమాన దూరంలో చేపట్టాలని, ఓ ఆర్ ఆర్ రోడ్డు నుండి ఒక దగ్గర 28 కిలోమీటర్లు మరో దగ్గర 50 కిలోమీటర్ల దూరంలో తీసుకపోవడం వల్ల ఆ ప్రాంత రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. ఎక్కడ నుండి తీసుకున్న రోడ్డు విస్తీర్ణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని, లేనియెడల భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, తీర్పారీ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, బత్తుల సుధాకర్, టంగుటూరి రాములు, రోషగారి అంజయ్య, దాసరి అంజయ్య, కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply