ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ..

ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ..
జాతీయ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు మహేష్
తొర్రూరు, ఆంధ్రప్రభ : జిల్లా పరిధిలో నూతనంగా ఎన్నికైన మాల సర్పంచ్,ఉపసర్పంచ్, వైస్ చైర్మన్, కౌన్సిలర్,వార్డు సభ్యులతో కలిసి ఆత్మీయ సన్మానసభ ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పెరమాండ్ల జగన్నాథ భవనం (సిపిఎం కార్యాలయం)లో ఆత్మీయ సన్మానసభ నిర్వహిస్తున్నామని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్ అన్నారు. మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మీయ సన్మాన సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన మాల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించి, సమాజ అభివృద్ధికి తదితర అంశాలపై దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్నుకోబడిన మాల ప్రజాప్రతినిధులు మాలమహానాడు రాష్ట్ర,జిల్లా, మండలాల బాధ్యులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం విజయవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో తొర్రూరు డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఎనమాల రాకేష్, మండల అధ్యక్షులు అనపర్తి నాగేష్, పట్టణ అధ్యక్షులు గార అనిల్, నాయకులు అడ్వకేట్ గంపల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
