TG | ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి..

TG | ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి..
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటూ కీలకం
ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్
TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ పేర్కొన్నారు. బుధవారం బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న రేణికుంట్ల ప్రవీణ్ – జ్యోతి దంపతులు సామాన్య ఓటర్లలా క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఓటింగ్ శాతాన్ని పెంచి పట్టణ వికాసానికి తోడ్పడాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఓటు వేయాలని ఆయన కోరారు.
