TG | భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలి..

TG | భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలి..
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ధర్మపురి లోని నిత్య అన్నదాన సత్యాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి..
TG | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చి భక్తులకు న్యాయమైన, రుచికరమైన భోజనం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవాలయ అధికారులను ఆదేశించారు. ఆదివారం ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య అన్నదాన సత్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వంట గదిని పరిశీలించారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఎందుకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి దేవాదాయశాఖ అధికారులకు తెలిపారు. అన్నదాన సత్రంలో అందుతున్న భోజనం ఎలా ఉందని భక్తులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నిత్య అన్నదాన సత్రంలో మౌలిక వసతుల కల్పనకు తన వంతుగా నిధులు కేటాయిస్తానని మంత్రి తెలిపారు. ఇందుకు కావలసిన అంచనాలు తయారు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
