అకాల వర్షం భీభత్సం..

అకాల వర్షం భీభత్సం..

  • నేలకొరిగిన పంటలు..
  • రైతన్న కష్టం నేలపాలు..

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వడగళ్ళ అకాల వర్షంతో రైతన్నలకు కంట తడి మాత్రమే మిగిలింది. ఆరు గాలం కష్టపడి పంట చేతి కొచ్చే సమయంలో వడగాళ్లతో భారీ వర్షం కురియడంతో వరి, నువ్వు పంటలు నెలకొరిగాయి. మంచి దిగుబడి ఖాయం అనుకున్న తరుణంలో మామిడి నేలరాలిపోయింది.

ఇప్పటికే అకాల వర్షం ఈదురు గాలులకు మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కనీసం వరి,నువ్వు, మామిడి పంటలు అయిన చేతికి వస్తాయి అని ఆశతో ఎదురు చూస్తున్న రైతన్నలకు తీవ్ర నిరాశ మిగిల్చింది ఈదురు గాలులతో వడగళ్ళ భారీ వర్షం. ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతన్న పరిస్థితి అంధకారంగా మారిపోయింది. కనీసం నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకో్వాలని రైతులు కోరుకుంటున్నారు.

Leave a Reply