Tension| ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత

Tension | ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
Tension | ఢిల్లీ, ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) (VHP) కార్యకర్తలు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం (Bangladesh High Commission Office) వద్ద భారీ నిరసన (protest) చేపట్టారు. ఈ నిరసనతో హైకమిషన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
వందల సంఖ్యలో చేరుకున్న వీహెచ్పీ కార్యకర్తలు బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, ఆలయాల ధ్వంసం, బలవంతపు మతమార్పిడులను తీవ్రంగా ఖండించారు. నినాదాలు చేస్తూ బారికేడ్లు దాటి హైకమిషన్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు (Delhi Police) భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి కార్యకర్తలను అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొడుతున్నారు. కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
