Temple | ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం

Temple | ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం

విమాన గోపురంపై ఆంజనేయ స్వామి ధ్వజాల ఆవిష్కరణ..
వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్త పూజలు..
భక్తుల క్షేమానికి శుభ సూచికమని అర్చకుల ఆశాభావం

Temple | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేపటినుండి ప్రారంభమవుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా ఆలయ విమాన గోపురంపై శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజాలను భక్తిశ్రద్ధలతో ఆవిష్కరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ సమక్షంలో ఉప ప్రధాన అర్చకులు శాండిల్యతో పాటు అర్చక బృందం శాస్త్రోక్త పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల నడుమ విమాన గోపురంపై హనుమత్ ధ్వజాలను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆంజనేయ స్వామి ధ్వజాలు ధర్మరక్షణకు, భక్తుల రక్షణకు ప్రతీకగా భావిస్తారని అర్చకులు తెలిపారు. ఈ ధ్వజాల ఆవిష్కరణతో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు శుభఫలితాలు కలుగుతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు, అర్చకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Temple |
Temple |
Temple |

CLICK HERE TO READ MORE : 4th day | ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం

CLICK HERE TO READ MORE

Leave a Reply