Results Released | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ లో తెలంగాణ పాలిసెట్ ఫ‌లితాలు

హైదరాబాద్ – తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ శనివారం విడుదల చేశారు. మొత్తం 84 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు.. ప‌లితాల‌లో బాలిక‌లే పై చేయి సాధించారు. ఇక ఈ పరీక్షలు ఈ నెల 13న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించగా.. మొత్తం 98,858 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 83,364 మంది విద్యార్థులు (84.33) ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలకు 53,085మంది బాలురు హాజరుకాగా.. 42,836 మంది(80.69)శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే 45,773 మంది బాలికలు హాజరు కాగా 40,528 మంది (88.54)శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్
https://www.polycet.sbtet.telangana.gov.in/#!/index

లో చూసుకోవచ్చు.

2025 పాలిసెట్ లో మొత్తం 120 మార్కులకు పరీక్షలు నిర్వహించగా.. అందులో.. 36 మార్కులు వచ్చిన అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఒక్క మార్కు తక్కువతో 35 మార్కులకు పాలిసెట్ అర్హత పొందారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెరిట్ ర్యాంకులు కేటాయించారు. ఇందులో 18037 మంది ఎస్సీ విద్యార్థులకు ర్యాంకులు రాగా, 7459 మంది ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులు వచ్చాయి.

Leave a Reply