TDP | గుడివాడలో ఉద్రిక్తత

TDP | గుడివాడలో ఉద్రిక్తత

  • టీడీపీ నేతపై హత్యాయత్నం
  • ముగ్గురికి గాయాలు

TDP | ( ఆంధ్రప్రభ, గుడివాడ ) : గుడివాడ గుడ్ మేన్ పేటలో టీడీపీ నేతపై ప్రత్యర్థుల దాడిలో ఉద్రిక్త వాతవారణం నెలకొంది. ఈ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతపై కత్తులతో మూకుమ్మడి దాడి జరిగింది. కత్తిపోట్లతో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్ మెన్ పేటకు చెందిన టీడీపీ నేత వేశపోగు ఇమ్మానుయేలుకు, ప్రత్యర్థులకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇమ్కానుయేలు ప్రత్యర్థులు గుడ్ మెన్ పేట సెంటర్ లో కత్తులతో మూకుమ్మడి దాడికి దిగారు. ఇమ్మానుయేలుపై దాడిని స్థానికులు అడ్డుకున్నారు.

జనంపైనా ప్రత్యర్థి వర్గీయులు దాడి చేశారు. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. ఇమ్మానుయేల్ సహా మరో ఇద్దరికీ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గుడివాడ టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో బాధితులను జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ,కూటమి నాయకులు పరామర్శించారు. ఈ దాడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

Leave a Reply