Tapas | మండల నూతన కమిటీ ఎన్నిక..

Tapas | మండల నూతన కమిటీ ఎన్నిక..

అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా రవీందర్, రాకేష్ కుమార్ లు ఏకగ్రీవం..


Tapas| మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా (Narayanapet District) మక్తల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) (TAPAS) మక్తల్ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తపస్ మండల అధ్యక్షులుగా బి.రవీందర్, ప్రధాన కార్యదర్శిగా రాకేష్ కుమార్ గౌరవాధ్యక్షులుగా నరసింహులు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి వి.భీమ్ రెడ్డి తెలియజేశారు.

ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యార్థుల విద్యా ప్రగతి కోసం అహర్నిశలు పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శేర్ క్రిష్ణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, ఎన్నికల పరిశీలకులు నాగార్జున్, ఆత్కూర్ నర్సిరెడ్డి, వెంకట్ రాములు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply