Tamilnadu | ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘన స్వాగతం…

Tamilnadu | ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘన స్వాగతం…
Tamilnadu | అచ్చంపేట, ఆంధ్రప్రభ : తమిళనాడు రాష్ట్రంలో “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా తీరుపుత్తూరు జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పక్రియను పర్యవేక్షించేందుకు ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు (Tamil Nadu State Congress Leaders) ఆయనకు ఘన స్వాగతం పలికారు. చెన్నై విమానాశ్రయంలో వంశీకృష్ణకు పూలమాలలతో స్వాగతం పలికిన స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆయనను పరిశీలకుడిగా నియమించడం పార్టీ బలోపేతానికి, తమిళనాడు కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణకు ఎంతో దోహదం చేస్తుందని అభినందించారు.
డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో పూర్తిగా పారదర్శకంగా, పార్టీ హైకమాండ్ (Party High Command) సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని వంశీకృష్ణ నేతలకు హామీ ఇచ్చారు. స్థానిక నాయకులతో చర్చలు జరిపి, అభ్యర్థుల అభిప్రాయాలు సేకరించి, తగిన నివేదికను ఏఐసీసీకి పంపనున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. డా. వంశీకృష్ణ పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ, నిర్వహణ పరంగా మంచి పేరును సంపాదించుకున్నారని, ఆయన నాయకత్వం ఈ ఎంపిక ప్రక్రియకు ప్రత్యేకమైన నిష్పాక్షికతను తీసుకువస్తుందని తమిళనాడు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు.
