ప్రతికూల పరిస్థితులను జయిస్తున్న ప్రతిభావంతులు..

  • దివ్యాంగుల పట్టుదల కృషి అనిర్విచనీయం..
  • భవిష్యత్తులో అంతర్జాతీయ విజయాలు ఖాయం.
  • శాప్ చైర్మన్ రవి నాయుడు..
  • శాప్ కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : ప్రతికూల పరిస్థితుల్లోనూ అకుంటత దీక్ష పట్టుదలతో విజయాలు సాధించడం అభినందనీయమని శాప్ చైర్మన్ ఏ.రవి నాయుడు పేర్కొన్నారు. విశేష ఆట తీరు ప్రదర్శిస్తున్న దివ్యాంగుల పట్టుదల కృషి చూస్తుంటే భవిష్యత్తులో మనకు అంతర్జాతీయ విజయాలు ఖాయంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని డిసేబిలిటీ క్రీడాకారులను శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఏండి ఎస్ భరణి సత్కరించి సన్మానించారు. తొలి మహిళా ప్రపంచ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన క్రీడాకారులు మడగశిర కు చెందిన దీపికా, పాడేరుకు చెందిన పి. కరుణా కుమారి లను శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఏండి ఎస్ భరణి ఘనంగా సన్మానించారు.

క్రీడా రంగంలో ప్రతికూల పరిస్థితులను జయించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్న ప్రతిభావంతుల విజయాలను చైర్మన్ అభినందించారు.

ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ.. డిసేబిలిటీ క్రీడాకారులు చూపుతున్న పట్టుదల, కృషి, ప్రతిభ నిజంగా రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. వీరి ఎదుగుదలకు, భవిష్యత్తు విజయాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. శాప్ ద్వారా అవసరమైన సహకారం నిరంతరం అందిస్తాము అని పేర్కొన్నారు. భారత బ్లైండ్ మహిళా క్రికెట్ జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపికా, కరుణా కుమారిల అసాధారణ ప్రదర్శన రాష్ట్రానికి అపార గర్వం అన్నారు. వీరి ప్రతిభ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలను అందుకుంటుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో శాప్ బోర్డు సభ్యుడు సంతోష్, ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారులు, అలాగే వివిధ విభాగాల డిసేబిలిటీ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply