t20 cricket| ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్

t20 cricket| ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ టీ20 క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాడు ఎవరు అనే దానికి ఇంట్రెస్టింగ్ రిప్లయ్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఆయన ఏ విధ్వంసకర బ్యాటర్ పెరు చెడుతాడో అనుకున్నారు అందరు. తనతో పాటు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ బ్యాటర్ల పేర్లు చెప్పకుండా.. ఓ బౌలర్ పేరు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అని టక్కున సమాధానం చెప్పాడు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. కొత్త బంతి అయినా.. పాత బంతి అయినా చివరకు సూపర్ ఓవర్ అయినా.. బుమ్రా చేతికి బంతి ఇస్తే మ్యాచ్‌ను గెలిపిస్తాడని వివరణ ఇచ్చాడు. అయితే తనకు బౌలింగ్ చేయనంత వరకే బుమ్రా గ్రేటెస్ట్ బౌలర్ అని నవ్వులు పూయించాడు.
2013 మార్చిలో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. 270 మ్యాచ్‌లు ఆడి 345 వికెట్లు తీసాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున 95 మ్యాచ్‌ల్లో 121 తీసాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 145 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీసాడు. ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
