పోలీసు సిబ్బందికి వేసవి రక్షణ సామగ్రి పంపిణీ..

పోలీసు సిబ్బందికి వేసవి రక్షణ సామగ్రి పంపిణీ..

నర్సంపేట, క్రైం, ఆంధ్రప్రభ : వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా ముందడుగు వేశారు. ఈ సందర్భంగా బయట పెట్రోలింగ్‌కి వెళ్లే సిబ్బందికి స్పెక్ట్స్, క్యాప్‌లు, టవళ్లు పంపిణీ చేశారు.

ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బందితో మాట్లాడుతూ… వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. తీవ్ర ఉష్ణోగ్రతల్లో ఎక్కువసేపు బయట పని చేయాల్సి వస్తుంది. కాబట్టి నీరు ఎక్కువగా త్రాగండి. సన్‌ స్ట్రోక్‌ కాకుండా రక్షణ సామగ్రి తప్పనిసరిగా వినియోగించండి అని సూచించారు. సిబ్బందికి ఆరోగ్య భద్రత పై ఇన్స్పెక్టర్ చూపిస్తున్న శ్రద్ధ పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా అందించిన రక్షణ సామగ్రి వేసవిలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు అని సిబ్బంది తెలిపారు.

Leave a Reply