summer | ఏక చక్ర నగర్ సేవ సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

summer | బోధన్, ఆంధ్రప్రభ ; ఉదయం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఏక చక్ర సేవాసమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రయాణికులకు వేసవి కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు మహేష్,యార్లగడ్డ శ్రీనివాసరావు,కౌన్సిలర్లు శరత్ రెడ్డి, దామోదర్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply