కూటమి అభ్యర్థుల గెలుపుకోసం విస్తృత ప్రచారం చేసిన బాల్క సుమన్

కూటమి అభ్యర్థుల గెలుపుకోసం విస్తృత ప్రచారం చేసిన బాల్క సుమన్

క్యాతన్ పల్లి, ఆంద్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17,19,20 వార్డులలో బిఆర్ఎస్, సిపిఐ పార్టీల కూటమి అభ్యర్థులను బారి మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదివారం ప్రచారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నరేళ్ల కాలం గడుస్తున్న,ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అన్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దే తప్ప కొత్తగా, చేసింది ఏమీ లేదని, కొబ్బరి కాయలు కొట్టడమే తప్ప, ఇప్పటివరకు సొంతంగా ఏం పని చేయలేదని అన్నారు.ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు,420 హామీలలో ఏ ఒక్కటి ప్రభుత్వం చేయలేదన్నారు.

మహిళలకు ఫ్రీబస్ తప్ప, ఒంటరి మహిళలకు 2500,వృద్ధులకు 4000,కళ్యాణ లక్ష్మీ తులం బంగారం,రైతులకు రైతు బంధు,రైతు బరోసా, ఈ పథకాలాన్ని చెప్పుకోవడానికితప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదని అన్నారు. మున్సిపల్ లో గత ప్రభుత్వ హయంలో జరిగిన అవివృద్ధే,మంత్రి వివేక్ చేసిన కొత్త ఎక్కడ కనబడటం లేదు అన్నారు. పట్టణం అభివృద్ధి చెందాలంటే కూటమిని బారి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ వార్డు అభ్యర్థులు, చెన్నూరు నియోజక వర్గం సీనియర్ నాయకులు రాజా రమేష్,పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్,మాజీ కౌన్సిలర్స్, అనిల్ రావు, గాజుల చంద్రశేఖర్, గోనె రాజేంద్రప్రసాద్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply