చీమలకు భయపడి.. ఆత్మహత్య..?

చీమలకు భయపడి.. ఆత్మహత్య..?

చీమలు చూసి ఎవరూ భయపడరు కదా.. మరి.. చీమలు చూసి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? కానీ.. చీమల వలన భయంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేష్‌ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ధ్యానపల్లి శ్రీకాంత్, అదే ఊరుకు చెందిన మనీష.. ఇద్దరికి 2022లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా పటాన్ చెరు మండలం అమీన్ పూర్ పరిధిలోని నవ్య హోమ్స్ లో నివాసం ఉంటున్నారు.

మనీషకు చిన్నప్పటి నుంచి మిర్మికోఫోబియా. అంటే.. ఈ చీమలంటే భయం అన్న మాట. ఈ వ్యాధికి సంబంధించి గత కొంకాలంగా సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నారట. అయితే.. ఈ నెల 4న శ్రీకాంత్ ఆఫీస్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపులకు లోపల గెడ పెట్టి ఉందట. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో పగలకొట్టి లోపలకి వెళితే.. మనీష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపించారట. కాగితం పై శ్రీ అయామ్ సారీ.. చీమలతో బతకటం నా వల్ల కాదు.. పాప జాగ్రత్త. అన్నవరం, తిరుపతి మొక్కులు తీర్చు.. ఎల్లమ్మతల్లికి ఒడిబియ్యం మరచిపోకు అని రాసిందట. అయితే.. ఆత్మహత్యకు ముందు ఇంటిని శుభ్రం చేస్తానని చెప్పి.. పాపను ఇంటికి దగ్గరలో ఉన్న బంధువులో ఇంట్లో ఉంచిందట. అయితే.. ఇంటికి శుభ్రం చేసేటప్పుడు చీమలు చూసి భయపడి ఉండచ్చని సీఐ తెలిపారు.

Leave a Reply