తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత..

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రతినెల 30న పౌర హక్కుల ( సివిల్ రైట్స్ డే) దినోత్సవాన్ని నిర్వహించాలని, శనివారం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేంధర్ ఆధ్వర్యంలో శనివారం తాసిల్దార్ ఇమామ్ బాబాకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య ,పాల్గొనిమాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతినెల 30న గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవం సంబంధించిన అధికారులు జరుపాలని కోరారు. ఈ పౌర హక్కుల దినోత్సవంలో గ్రామ సర్పంచి వార్డ్ మెంబర్లు వివిధ కులాల ప్రజలు ఇందులో పాల్గొనే విధంగా చూడాలని, సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు, కార్యదర్శి దాసారపు నరేష్, అంబేద్కర్ వాదులు గురుకుంట్ల కిరణ్, గుర్రపు తిరుపతి, నేరేళ్ల రవి, తదితరులు పాల్గొన్నారు.
