Students | రాష్ట్ర స్థాయిలో గురుకుల విద్యార్థుల ప్ర‌తిభ‌

Students | రాష్ట్ర స్థాయిలో గురుకుల విద్యార్థుల ప్ర‌తిభ‌

Students | మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర స్థాయి డిబేట్, ఉపన్యాస పోటీల్లో నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని బీసీ గురుకుల బాలుర పాఠశాల మక్తల్ న్యూ విదార్థులు ప్రతిభ చాటారు. మహాత్మా జ్యోతీ బాపూలే బీసీ గురుకుల విద్యాలయ సంస్థ హైద‌రాబాద్ వారిచే రంగారెడ్డి జిల్లాలోని బీసీ గురుకుల పాఠశాల కేశంపేటలో రాష్ట్ర స్థాయి లిటరసీ కల్చరల్ కార్నివాల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈనెల22 నుండి 24 వరకు జరిగిన పోటీలో అంబేడ్కర్ నగర్ మక్తల్ న్యూ బీసీ గురుకుల పాఠశాల విదార్థులు పాల్గొని బహుమతులు సాధించారు.

అండర్ – 14 విభాగంలో ఉపన్యాస పోటీలో 5వ తరగతి విదార్థి పి.పవన్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించారు. అండర్ -14 విభాగంలో ఇంగ్లిష్ డిబేట్ పోటీల్లో బూరుగుపల్లి, మక్తల్ న్యూ విదార్థులు జి.శశాంక్, పి జి.సాత్విక్, సాయి చాణక్య 7వ తరగతి విద్యార్థులు పాల్గొని ద్వితీయ బహుమతి సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ రాములు తెలిపారు. అదేవిధంగా అండర్ -17 సీనియర్స్ విభాగంలో హిందీ డిబేట్ పోటీలో యం.నంది వర్ధన్ (10వ తరగతి), ఎస్.రామ్ చరణ్ (8వ తరగతి) బి.సుదర్శన్ (8వ తరగతి) పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతి సాధించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన విదార్థులను పాఠశాల ప్రిన్సిపల్ యం. రాములు, ఉపాధ్యాయ బృందం శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.

Leave a Reply