Statue | తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా పొట్టి శ్రీరాములు

Statue | తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా పొట్టి శ్రీరాములు

తూర్పు నియోజకవర్గంలో ఘనంగా పొట్టి శ్రీరాములు 125 వ జయంతి వేడుకలు
పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించిన గద్దె అనురాధ

Statue | పటమట, ఆంధ్రప్రభ : తెలుగువారి గుండెల్లో పొట్టి శ్రీరాములు చిరస్థాయిగా నిలిచిఉంటారని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారంనాడు ఘనంగా జరిగాయి. గద్దె అనురాధతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం రాజధాని అమరావతిలో ‘‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’’ పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యముంత్రి ఇతర పెద్దలు ఘనంగా అర్పించిన నివాళులను, బహిరంగ సభను పెద్ద టీవీ ఏర్పాటు చేసి అందరికీ ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ దీక్ష నిర్వహించడం అంటే సాధారణ విషయం కాదన్నారు. పోట్టి శ్రీరాములు చేసిన త్యాగం మనందరికీ స్ఫూర్తిగా ఉంటుందని అన్నారు.

Statue |

తెలుగువారి ప్రత్యేక గుర్తింపు కోసం పోట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని త్యాగం చేశారని కొనియాడారు. తెలుగు వారి గుర్తింపు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పోట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో తెలుగు వారికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రం ప్రగతిని సాధించి తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి తీసుకువెళ్ళడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ కృషి చేస్తున్నారన్నారు.

Statue |

స్వాతంత్య్ర సమరయోధులతో పాటుగా పొట్టి శ్రీరాములు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని గద్దె అనురాధ పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, రత్నశ్రీ, మొకర ఆదిబాబు, పొనుమోలు లక్ష్మి, అన్నాబత్తుల శ్రీదేవి, మల్లెల రామకృష్ణ, కర్ణ రమేష్, శింగంశెట్టి రమేష్, గోగుల ఏసు, కోట శివలక్షి, మేదరమెట్ల నారాయణ, పోలుపల్లి మునికృష్ణ, యలమంచలి రవీంద్ర, బాజీ, పోడూరు పవన్, మల్లెల లక్ష్మీనారాయణ, వి.ఎం.సి. అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ షమ్మి, స్వర్ణాంధ్ర నియోజకవర్గ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Statue |
Statue |

CLICK HERE TO READ MORE : Kondapalli Fort Dargah | కొండపల్లి ఖిల్లాకు దారి న‌హీ

CLICK HERE TO READ MORE :

Leave a Reply