శనిగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

శనిగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

జైనూర్, ఆంధ్రప్రభ : జైనూర్, సిర్పూర్ (యు ) మండలాల్లో మంగళవారం అసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవలక్ష్మి మంగళవారం పర్యటించారు. మండల కేంద్రంలోని మార్కెటింగ్ కమిటీ గోదాంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్, నా షెడ్ ఆధ్వర్యంలో జైనూర్ మార్కెట్ గోదాంలో ఏర్పాటుచేసిన శనిగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన శనిగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకోవచ్చు విక్రయించాలని తగిన మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

శనగ కొనుగోలు కేంద్రం ద్వారా శనగ ధాన్యం క్వింటాలుకు రూ, 5,875 రూపాయల మద్దతు కొనుగోలు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాలలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు, అసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల, జైనూర్ ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్, జైనూర్ సహకార మాజీ చైర్మన్ కొడప హన్ను పటేల్, ఆసిఫాబాద్ ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్, ఆసిఫాబాద్ డిసిఒ మోహన్, జైనూర్,ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, జైనూర్, తాసిల్దార్ఆడబిర్షావ్, జైనూర్ ఆర్ ఐ మోహన్, జైనూర్ సహకార బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్, జైనూర్ సహకార సీఈవో సోన్ కాంబ్లే జనార్ధన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల, వివిధ పంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఉద్యోగులు, లబ్ధిదారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply