Srisailam | పోటెత్తిన భక్తులు..

Srisailam | పోటెత్తిన భక్తులు..

Srisailam, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు చేసి గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీస్వామి వారి అలంకార దర్శనానికి అనుమతించారు. ఈ ఒక్కరోజు శివారాధన చేస్తే.. కోటి సోమవారాల ఫలితాన్ని, కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, శివుడి గుడిలో దీపదానం చేస్తే.. శుభకరమని పండితులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu states) శివాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Leave a Reply