శ్రీశైలం అష్టదిగ్భంధనం

శ్రీశైలం అష్టదిగ్భంధనం

  • 800 మంది పోలీసుల పహారా
  • ప్రధాని పర్యటన ప్రాంతాల్లో పకడ్బందీ భద్రత
  • డీజీపీ స్వయం పర్యవేక్షణ

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన నంద్యాల జిల్లా శ్రీశైలం(Srisailam)లో పర్యటించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న తరుణంలో.. పకడ్బందీ బందోబస్తుకు 1800 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌(SP Sunil Sheran) తెలిపారు. మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి హెలిపాడ్ కు చేరుకున్నప్పటి నుంచి దర్శనం అనంతరం రిగి వెళ్లే వరకు ఆయన భద్రతపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు.

ఆనయ పర్యటించే ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నానరు. ముఖ్య ప్రాంతాలల్లో, కూడళ్లల్లో సాయిధ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేశారు. బందోబస్తు విధుల్లోని సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్(Sect)కు ఒక ఉన్నతాధికారిని ఇన్ చార్జీని నియమించారు. జియో గ్రాఫికల్ మ్యాప్ తో ప్రధాని పర్యటించే ప్రాంతాలలో భద్రత చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి జిల్లా ఎస్పీ వివరించారు . రోడ్డు మార్గాల్లో, ముఖ్య కూడళ్లలో, గుడి పరిసర ప్రాంతాలలో రూప్ టాప్ సిబ్బందిని నియమించారు.

వీరికి బైనాక్యులర్ తో అప్రమత్తంగా ఉంటారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీచేయాలని ఇది 24/7 కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. కమాండ్ కంట్రోల్లో(in command control)ని సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కెమెరాలను పరిశీలించాలని ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. హెలిపాడ్, గుడి, శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రాంతాలలో ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో యాక్సెస్ కంట్రోల్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు.

శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రౌడ్ కంట్రోల్ కొరకు రూప్ టాప్, క్యూఆర్టీ , స్పెషల్ పార్టీల(Roop Top, QRT, Special Parties)ను నియమించాలని ఆదేశించారు .ప్రధాని పర్యటనకు వచ్చిన సుమారు 1800 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి ప్రత్యేక డ్యూటీ పాసులను ఆత్రేయ డిజిటల్స్(Atreya Digitals) సహకారంతో ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. డ్యూటీలోని పోలీసు అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఐడీ కార్డులు ధరించాలన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన గుర్తింపు పాసులను తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

శ్రీశైలంలో ప్రధాని పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం పర్యవేక్షించారు. ప్రధాని చేరుకునే హెలిపాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్(Bhramaramba Guest House), శివాజీ స్ఫూర్తి కేంద్రం ,గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ తదితర ప్రాంతాలలో భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్,ఈగల్ టీం ఐజీ ఆకే. రవికృష్ణ , నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌, అదిరాజ్ సింగ్ రాణా, ఏ ఎస్పీ ఎం.జావళి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply