అనూహ్యంగా లక్షల భక్తుల్ని ఆకట్టుకున్నపురాణపండ గ్రంధం
హైదరాబాద్ : ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థ బి ఎస్ సి పి ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మాజీ మంత్రి , కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతంగా రచించి సంకలనీకరించిన ‘ శ్రీమాలిక ‘ మహాగ్రంధం ఇప్పటికే వేల వేల పాఠకుల్ని ఆకర్షించడంతో… ఇప్పటికి పదహారు పునర్ముద్రణలకు నోచుకున్న శ్రీమాలిక అఖండ గ్రంధాన్ని హనుమాన్ జయంతి ఉత్సవ సంరంభం సందర్భంగా మణికొండలో ఏర్పాటైన మన్యుసూక్త ఏకాదశ పారాయణ సహిత అఖండ రుద్రాభిషేకమహోత్సవంలో అతిధులకు , అర్చకులకు, వేదపండితులకు బొల్లినేని కృష్ణయ్య శాలువతో ఘనంగా సత్కరించి అందరికీ బహూకరించడం విశేషంగా పేర్కొనక తప్పదు.
భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్ . వెంకయ్యనాయుడు మొదలు , విఖ్యాత ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు, తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు , యాదాద్రి ప్రధాన అర్చకులు ఎన్ . లక్ష్మీ నరసింహాచార్యులు వంటి ప్రముఖులెందరో ప్రశంసలు వర్షించిన శ్రీమాలిక గ్రంథ మహత్తు కారణంగా అనేక ఆలయాల, పారాయణ మండళ్ల , పీఠాధిపతుల, మఠాధిపతుల వద్ద నిత్యపారాయణా కరదీపికగా తేజరిల్లడం మన కన్నులముందే ప్రస్ఫుటంగా కనిపిస్తున్న సత్యం.
వేద సూక్తాల నడుమ మహా రుద్రాభిషేకాలు జరిగిన హనుమజ్జయంతి పుణ్య విశేషంలో ఈ మహోత్తమమైన శ్రీకార్యం జరగడం ఆనందదాయకమని వేదపండితులు బొల్లినేని కృష్ణయ్యకు ఘనంగా వేదాశీర్వచనం చేయడం విశేషం.
గతంలో నేనున్నాను, యుగే యుగే , మహా సౌందర్యం, మహామంత్రస్య , శ్రీపూర్ణిమ,
శరణు … శరణు , అమ్మణ్ణి , శంకర … శంకర , అదివో … అల్లదివో … వంటి పరా శోభాయమానమైన ఎన్నో దైవీయ గ్రంధాలను ఈ దేశపు ఎల్లలు దాటించి వేల కొలది అభిమానుల్ని సంపాదించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దివా గ్రంధాలను గతంలో శృంగేరీ, కంచి , పుష్పగిరి పీఠాధిపతులు ఆవిష్కరించి అనుగ్రహ వాత్సల్యం వర్షించడాన్ని విశేషాఅంశంగా మేధోసామాజం పేర్కొంటోంది.
తెలుగు చలనచిత్ర రంగంలో అరవైశాతం పై చిలుకుగా నటీ నటుల గృహాల పూజాపీఠాల మూడు పురాణపండ శ్రీనివాస్ భవ్య దివ్య గ్రంధాలనే పారాయణం చేస్తారనేది నిర్వివాదాంశం.

